in

చికెన్ చంగేజి | Chicken Changezi | Side Dish Recipes | Chicken Recipes | Non Veg Curries

https://www.amazon.in/shop/homecookingshow%20

చికెన్ చంగేజి ఒక నార్త్ ఇండియన్ సైడ్ డిష్. దీన్ని రోటి, ఫుల్కా, నాన్లాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.

#chickenchangezi #homecookingtelugu #chickenrecipes #homecooking #hemasubramanian #chickencurry

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/357jivu

Link to Mango Special (మ్యాంగో స్పెషల్స్) Recipes: https://bit.ly/3zdo4VN

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 45 నిమిషాలు
సెర్వింగులు: 4

మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:

చికెన్ – 1 / 2 కిలో
పెరుగు – 200 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
కారం – 2 టీస్పూన్లు
ఒక నిమ్మకాయ రసం
నూనె

మసాలా పేస్టు కోసం కావలసిన పదార్థాలు:

నూనె
ఉల్లిపాయలు – 2 (పొడవుగా తరిగినవి)
జీడిపప్పులు – గుప్పెడు
టొమాటోలు – 3
ఉప్పు

చికెన్ చంగేజి కోసం కావలసిన పదార్థాలు:

నెయ్యి – 2 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 / 2 టీస్పూన్
కాశ్మీరీ ఎండుకారం – 1 టీస్పూన్
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
చాట్ మసాలా పొడి – 1 టీస్పూన్
రుబ్బుకున్న మసాలా పేస్టు
పాలు – 1 / 2 కప్పు
వేయించిన చికెన్
తరిగిన పచ్చిమిరపకాయ
ఉప్పు
నీళ్లు – 1 / 2 కప్పు
ఫ్రెష్ క్రీం – 2 టేబుల్స్పూన్లు
కసూరీ మేథీ

తయారుచేసే విధానం:

ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం పైన రాసిన విధంగా, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక బౌల్లో వేసి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టి ఉంచాలి

తరువాత ఒక పాన్లో నూనె వేసి, అందులో మ్యారినేట్ చేసిన చికెన్ను వేసి, బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి

అదే పాన్లో నూనె వేసి, ఉల్లిపాయలు, టొమాటోలు, జీడిపప్పులు, ఉప్పు వేసి బాగా వేయించి, చల్లార్చి, మిక్సీలో వేసి మెత్తటి పేస్టు అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో నెయ్యి వేసి, అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించిన తరువాత కాశ్మీరీ ఎండుకారం, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి వేసి బాగా కలిపి, అందులో రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్టును వేసి వేయించాలి

ఇందులో వెంటనే పాలు పోసి గ్రేవీని బాగా కలిపిన తరువాత వేయించిన చికెన్ను వేసి ఇంకొకసారి కలపాలి

ఇందులో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలిపిన తరువాత నీళ్లు పోసి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, చికెన్ను కనీసం పది నిమిషాలు ఉడికించాలి

ఆ తరువాత కూరలో నూనె పైకి తేలితే, ఫ్రెష్ క్రీం వేసి వెంటనే పొయ్యి కట్టేయాలి

కూర పైన కసూరీ మేథీని నలిపి వేసుకోవాలి, అలాగే సర్వ్ చేసే ముందు కూర పైన తరిగిన కొత్తిమీరని వేస్తే చాలా బాగుంటుంది

అంతే, చికెన్ చంగేజి తయారైనట్టే

You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!

ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK: https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

How to Make Baklava | Baklava Recipe | Easy Turkish Dessert Recipes | BAKLAVA

Chicken Tikka Boti Without Oven | Chicken Boti Kabab Recipe Without Oven by Pakistani Mom In USA