ప్యాన్ రోస్టెడ్ చికెన్ | Pan Roasted Chicken | Chicken Recipes | Roasted Chicken
ప్యాన్ రోస్టెడ్ చికెన్ను కోడికాళ్లతో చేస్తారు. ఈ రెసిపీలో మ్యారినేడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్యాన్ రోస్టెడ్ చికెన్ను ఉన్నపళంగానే తినచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
#panroastedchicken #homecookingtelugu #chickenroast #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/35nwIV5
తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 35 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
చికెన్ కాళ్ళు – 2
ఉప్పు – 1 టీస్పూన్
ఒక నిమ్మకాయ రసం
పెరుగు – 1 / 2 కప్పు
ఫ్రెష్ క్రీం – 1 టేబుల్స్పూన్
నెయ్యి
ఉల్లిపాయలు – 2 (పొడవుగా తరిగినవి)
అల్లం ముక్క – 1 (తరిగినది_
వెల్లుల్లి రెబ్బలు – తరిగినవి
పచ్చిమిరపకాయలు – 2 (తరిగినవి)
జీలకర్ర – 1 / 2 టీస్పూన్
సోంపు గింజలు – 1 / 2 టీస్పూన్
పసుపు – 1 / 4 టీస్పూన్
కారం – 2 టీస్పూన్లు
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
ఉప్పు – 1 / 4 టీస్పూన్
తరిగిన పుదీనా & కొత్తిమీర
నెయ్యి – 1 టేబుల్స్పూన్
తయారుచేసే విధానం:
ముందుగా చికెన్కు గాట్లు పెట్టి, ఒక బౌల్లో వేసిన తరువాత ఉప్పు, నిమ్మరసం, పెరుగు, ఫ్రెష్ క్రీం వేసి చికెన్ కాళ్ళకి పట్టేట్టు బాగా రుద్దిన తరువాత పక్కన పెట్టి కాసేపు వదిలేయాలి
ఇది ఫస్ట్ మ్యారినేడ్
రెండో మ్యారినేడ్ కోసం ఒక పాన్లో నెయ్యి వేసి వేడి చేసి, అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సోంపు గింజలు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పోసి వేసి బాగా కలపాలి
వీటిని రెండు నిమిషాలు వేయించిన తరువాత పొయ్యి కట్టేసి చల్లార్చి, ఒక మిక్సీలో వేసి బరకగా ఉండేట్టు రుబ్బుకోవాలి
పక్కన పెట్టిన చికెన్లో ఈ రెండో మ్యారినేడ్ పేస్టు వేసి బాగా కలపాలి
ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసి కలిపి, రెండు గంటల పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి
ఇప్పుడు ఒక పాన్లో కొదిద్గా నెయ్యి వేసి అందులో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి, ఒక మూత పెట్టి పది నిమిషాలు వేయించాలి
ఆ తరువాత చికెన్ను ఇంకొక వైపుకి తిప్పి ఇంకొక పది నిమిషాలు వేయించాలి
పాన్లో ఉన్న మ్యారినేడ్ను చికెన్ ముక్కల పైన రాయచ్చు
పది నిమిషాల తరువాత మళ్ళీ ఒకసారి చికెన్ను రెండో వైపుకి తిప్పి కాల్చాలి
ఇలా చికెన్ కాళ్లకు రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చిన తరువాత పొయ్యి కట్టేయచ్చు
పాన్ రోస్టెడ్ చికెన్ తయారైనట్టే, దీన్ని మీరు ఉన్నపళంగా వేడిగా తింటే చాలా బాగుంటుంది
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com
source