ఆలూ చికెన్ కర్రీ చాలా సింపుల్‌గా ఎలా చేయాలో మీరు ఈ వీడియోలో చూడచ్చు. ఇది ప్రత్యేకించి బాచిలర్స్కి , వంట కొత్తగా నేర్చుకునే వారికి చాలా సులువుగా ఉండే పధ్ధతి. తప్పకుండా ఈ టేస్టీ ఆలూ చికెన్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందొ చెప్పండి.
#aloochickencurry #homecookingtelugu #aloochicken #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/331b3kT
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 40
సెర్వింగులు: 4
మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
చికెన్ – 1 కిలో
బంగాళాదుంపలు – 4 (తరిగినవి)
ఉప్పు – 3 టీస్పూన్లు (Buy: https://amzn.to/2vg124l)
పసుపు – 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2RC4fm4)
కారం – 2 టేబుల్‌స్పూన్లు (Buy: https://amzn.to/3b4yHyg)
నీళ్లు
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్ (Buy: https://amzn.to/314FymX)
ఆలూ చికెన్ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు:
నూనె – 2 టేబుల్‌స్పూన్లు (Buy: https://amzn.to/2RGYvrw)
దాల్చిన చెక్క (Buy: https://amzn.to/31893UW)
లవంగాలు (Buy: https://amzn.to/36yD4ht)
యాలకులు (Buy: https://amzn.to/2U5Xxrn)
సోంపు గింజలు (Buy: https://amzn.to/2u1p6rl)
ఉల్లిపాయలు – 4 (చిన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు – 3 (చీల్చినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్ (Buy: https://amzn.to/314FymX)
టొమాటోలు – 4
ఉప్పు – 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l)
ధనియాల పొడి – 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/36nEgEq)
జీలకర్ర పొడి – 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2TPuOXW)
గరం మసాలా పొడి – 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2TPe8jd)
కాశ్మీరీ ఎండుకారం – 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2GgLsrp)
తరిగిన కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా ఒక బౌల్లో బోన్ ఉన్న చికెన్‌ను తీసుకుని, తరిగిన బంగాళాదుంప ముక్కలని కూడా వేయాలి
అందులో, ఉప్పు పసుపు, కారం వేసి బాగా కలిపి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి
ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక ప్రెషర్ కుక్కరులో వేసి, దానితో పాటు కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, బాగా కలిపి, నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ పక్కన పెట్టుకోవాలి.
ఆలూ చికెన్ కర్రీ చేయడానికి ఒక కడాయిలో నూనె వేసి, అందులో మసాలా దినుసులన్నీ వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి, ఉలిపాయలు రంగు మారేంత వరకూ వేయించాలి
ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి
అందులో, తరిగిన నాలుగు టొమాటోలని వేసి బాగా మగ్గనివ్వాలి
ఇప్పుడు కాస్త ఉప్పు వేసి కలిపిన తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి
ఇందులో, ఉడికించి పెట్టుకున్న చికెన్‌ను, చికెన్ స్టాక్‌ను కూడా వేసుకోవాలి
ఇదంతా ఒకసారి కలిపిన తరువాత కాశ్మీరీ ఎండుకారం వేసి, కడాయికి ఒక మూత పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి పది నిమిషాలు ఉడికించాలి
ఆ తరువాత గ్రేవీ కాస్త చిక్కుపడి, నూనె కూడా పైకి తేలుతుంది
చివరగా దీని పైన తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసి, వేడివేడిగా అన్నంలోకి కానీ రోటి ఫుల్కాల్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com
source