చికెన్ సేమియా | Chicken Semiya | Vermicelli Recipes | Variety Semiya Recipes | Chicken Recipes
సేమియాను మాములుగా ఉప్మాలాగా చేసుకుని తింటుంటాము. కానీ సేమియాను చికెన్తో కలిపి చేసే రెసిపీ చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కొత్త రకం చికెన్ సేమియాను తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్ సెక్షన్లో చెప్పండి.
#chickensemiya #homecookingtelugu #chickensemiyaupma #homecooking #chickenrecipes #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/37DC8gd
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
చికెన్ – 300 గ్రాములు
నీళ్లు
ఉప్పు – 1 టీస్పూన్
మిరియాల పొడి
నీళ్లు
ఉప్పు – 1 టీస్పూన్
సేమియా – 200 గ్రాములు
నూనె – 1 టీస్పూన్
నువ్వుల నూనె
వెల్లుల్లి రెబ్బలు – 4 (చిన్నగా తరిగినవి)
ఉల్లికాడ గడ్డలు – 1 / 2 కప్పు
కాప్సికం ముక్క – 1 (తరిగినది)
క్యారెట్ – 1 (తురిమినది)
క్యాబేజీ ముక్క – 1 (తురిమినది)
అల్లం ముక్క – 1 (చిన్నగా తరిగినది)
లైట్ సోయా సాస్ – 2 టేబుల్స్పూన్లు
ఆయిస్టర్ సాస్ – 1 టేబుల్స్పూన్
పండుమిరపకాయ – 1 (సన్నగా తరిగినది)
మిరియాల పొడి
లైట్ సోయా సాస్ – 1 / 2 టేబుల్స్పూన్
ఉల్లికాడలు
తయారుచేసే విధానం:
ఒక ప్రెషర్ కుక్కరులో కొన్ని నీళ్లు పోసి, అందులో చికెన్ ముక్కలు వేసి, కాస్త ఉప్పు వేసి, కుక్కరుకి మూత పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, చికెన్ను 4 – 5 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
ఆ తరువాత చికెన్ను చల్లార్చి, చిన్న ముక్కలుగా తుంచిపెట్టుకోవాలి
ఇంకొక గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు, మిరియాల పొడి వేసి, సేమియాను వేసి రెండు నిమిషాలు ఉడికించిన తరువాత, మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికించి, బయటకి తీసి వడకట్టి, కాస్త నూనె చల్లి పక్కన పెట్టుకోవాలి
ఒక పాన్లో నువ్వుల నూనె వేసి, అందులో వెల్లుల్లి, ఉల్లికాడ గడ్డలు, అల్లం, కాప్సికం, క్యారెట్, క్యాబేజీ, వేసి బాగా కలిపిన తరువాత తుంచిపెట్టిన చికెన్ ముక్కలు వేసి కలిపి, లైట్ సోయా సాస్, ఆయిస్టర్ సాస్, పండుమిరపకాయ, మిరియాల పొడి వేసిన తరువాత చికెన్ స్టాక్ను వేసి కలపాలి
ఆ తరువాత ఉడికించిన సేమియాను వేసి, లైట్ సోయా సాస్, నువ్వుల నూనె, ఉల్లికాడలు వేసి బాగా కలపాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే చికెన్ సేమియా తయారైనట్టే
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com
source