in

చెట్టినాడు చికెన్ కర్రీ | Chettinadu Chicken Curry | Chicken Recipes | Non Veg Curries

https://www.amazon.in/shop/homecookingshow%20

చెట్టినాడు చికెన్ కర్రీలో వివిధ రకాల మసాలా దినుసుల వాడకం ఉండటం వల్ల ఇది ఒక ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. ఈ కూరని అన్నంలోకి లేదంటే చపాతీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు.

#chettinaduchickencurry #homecookingtelugu #chettinadchicken #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/33QCz3i

తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

చికెన్ – 1 కిలో
ఒక నిమ్మకాయ రసం
పెరుగు – 1 / 2 కప్పు
ఉప్పు – 1 టీస్పూన్
పసుపు – 1 / 4 టీస్పూన్
కారం – 1 టేబుల్స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టేబుల్స్పూన్

మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు:

మసాలా దినుసులు
(దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు)
మిరియాలు – 1 1 /2 టీస్పూన్లు
ధనియాలు – 1 1 / 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర – 1 టీస్పూన్
సోంపు గింజలు – 1 / 2 టీస్పూన్
గసగసాలు – 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు – 6
పచ్చికొబ్బరి తురుము – 1 / 2 కప్పు
నీళ్లు

కూర చేయడానికి కావలసిన పదార్థాలు:

నువ్వుల నూనె – 1 1 / 2 టేబుల్స్పూన్లు
చిన్న ఉల్లిపాయలు – 1 కప్పు (పొడవుగా తరిగినవి)
పచ్చిమిరకాయ – 1 (చీల్చినది)
టొమాటో – 1 (తురిమినది)
కల్లుప్పు – 1 టీస్పూన్
మ్యారినేట్ చేసిన చికెన్
రుబ్బుకున్న మసాలా పేస్టు
నీళ్లు – 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
కరివేపాకులు

తయారుచేసే విధానం:

ముందుగా చికెన్ను ఒక బౌల్లో వేసి అందులో నిమ్మరసం, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్ని వేసి బాగా కలిపి, ముప్పై నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి

ఒక పాన్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, గసగసాలు, ఎండుమిరపకాయలు అన్నిటినీ ఒకదాని తరువాత ఒకటి వేసి నూనె లేకుండా వేయించాలి

ఇవి రంగు మారిన తరువాత, పక్కన పెట్టి చల్లార్చి, ఒక మిక్సీలో వేసి పొడి అయ్యేట్టు రుబ్బుకున్న తరువాత, కొబ్బరి, నీళ్లు పోసి మెత్తటి పేస్టు అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టుకోవాలి

ఒక పాన్లో నువ్వుల నూనె వేసి, అందులో చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించిన తరువాత టొమాటోలు, ఉప్పు వేసి కలిపి వేయించాలి

ఆ తరువాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మిశ్రమాన్ని వేసి ఒక ఐదు నిమిషాలు వేయించిన తరువాత రుబ్బుకున్న మసాలా పేస్టును వేసి కలుపుకోవాలి

ఇందులో నీళ్లు పోసి, కొన్ని కరివేపాకులు వేసి, పాన్కు మూత పెట్టి, చికెన్ను ఇరవై నిమిషాలు ఉడికించాలి

అంతే చెట్టినాడు చికెన్ కర్రీ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

KFC Style Extra Crispy Chicken Strips or Tenders Recipe in Urdu Hindi – RKK

Grilled Chicken in Garlic Parmesan Cream Sauce || Creamy Garlic Parmesan Chicken Recipe – RKC