Garlic Butter Chicken Recipe In Telugu
Butter Garlic Chicken
Garlic Chicken Recipe
Simple Chicken Starters
How to Make Garlic Chicken
Lakshmi Vantillu
Indian Home Food Recipes in Telugu
Welcome to lakshmi vantillu
ఈ రోజు Butter Garlic Chicken ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
బోన్ లెస్ చికెన్ 250 grams – బట్టర్ 3 tsp – మిరియాల పొడి 1 tsp – ఉప్పు 1 tsp – ఆయిల్ 2 tsp – కార్న్ ఫ్లోర్ 2 tsp – వెల్లుల్లి రెబ్బలు 5 – రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 tsp – సోయా సాస్ 1 tsp – వినేగార్ 1 tsp – పచ్చి మిర్చి 2 – ఉల్లి కాడలు 2
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ – ½ tsp ఉప్పు – ½ tsp మిరియాల పొడి – 1 tsp కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి అరగంట సేపు పక్కన పెట్టుకోండి
తరువాత స్టవ్ పై కడాయి పెట్టి 2 tsp ఆయిల్ వేసి కలిపి ఉంచుకున్న చికెన్ ని కలర్ చేంజ్ అయ్యేవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి
ఇప్పుడు మరోక కడాయి ని స్టవ్ పై పెట్టి బట్టర్ వేసి – మెల్ట్ అయిన తరువాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం సేపు వేగిన తరువాత కట్ చేసిన పచ్చి మిర్చి , ఉల్లికాడలు వేసి ఒక నిమషం పాటు ఫ్రై చేసుకోండి
1 tsp కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని దీనిలో కలపండి
తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ – ½ tsp ఉప్పు – ½ tsp మిరియాల పొడి – 1 tsp చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొండి
చివరిగా వెనిగర్ – సోయా సాస్ వేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక నిమషం పాటు ఫ్రై చేసుకోండి
tasty గా బట్టర్ గార్లిక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#garlicchicken #recipe #telugu