సూపర్ టేస్టీ పాలమూరు గ్రిల్ చికెన్ | Special Palamuru Grill Chicken | Street Food Recipes | Chicken Recipes
గ్రిల్ చికెన్ తయారీ విధానం : ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత చికెన్ పీసెస్‌కి అల్లం వెలుల్లి పేస్ట్, కారం, గరంమసాలా, నిమ్మరసం, నూనె మరియు ఉప్పు బాగా దట్టించి 2 గంటలు పాటు నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకోవడం వల్ల మసాలా చికెన్ ముక్కలకి బాగా పట్టి చాలా రుచిగా ఉంటాయి. తర్వాత గ్రిల్‌కి ఈ పీసెస్‌ని గుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలుని 180 లేదా 200 డిగ్రీల వేడి మీద పెట్టుకుని 20 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఒకవేళ చికెన్ ఎర్రగా అవ్వకపోతే మరొక 5 నుండి 10 నిమిషాలు కాలనివ్వాలి.
అంతేనండి రుచికరమైన గ్రిల్ చికెన్ తయారైపోతుంది. అదీ పాలమూరు గ్రిల్ చికెన్ ఒక్కసారి రుచి చూసారంటే ఎప్పటకీ మరిచిపోలేరు.
source