in

స్పెషల్ చికెన్ ఫ్రై | Special Chicken Fry | Chicken Recipes | Chicken Fry | Side Dish

https://www.amazon.in/shop/homecookingshow%20

స్పెషల్ చికెన్ ఫ్రై అనే పేరు చూసి, ఇది చేయడం చాలా కష్టం అని అనుకుంటారేమో, కానీ ఈ కూరని చాలా సులువుగా చేసుకోవచ్చు. దీనిలో మనం సాధారణంగా వాడే పదార్థాలు మాత్రమే వాడతాము. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.

#specialchickenfry #Homecookingtelugu #chickenfry #homecooking #hemasubramanian #chickenrecipes

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/35auoQJ

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

నూనె – 2 టేబుల్స్పూన్లు
దాల్చిన చెక్క – 1 ముక్క
లవంగాలు – 7
యాలకులు – 4
ఉల్లిపాయలు – 3 (పొడవుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు – 2 (చీల్చినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీస్పూన్లు
కరివేపాకులు
టొమాటోలు – 3
కల్లుప్పు – 2 టీస్పూన్లు
పసుపు – 1 / 2 టీస్పూన్
కారం – 4 టీస్పూన్లు
ధనియాల పొడి – 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి – 2 టీస్పూన్లు
చికెన్ – 1 కిలో
నీళ్లు
చిక్కటి కొబ్బరి పాలు – 1 కప్పు
తరిగిన కొత్తిమీర – గుప్పెడు

తయారుచేసే విధానం:

ముందుగా ఒక కడాయిలో నూనె వేసి, అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకూ వేయించాలి

ఆ తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించిన తరువాత, కొన్ని కరివేపాకులాని వేసి రెండు నిమిషాలు వేయించాలి

ఇందులో టొమాటోలు వేసి కలిపిన తరువాత కల్లుప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి, టొమాటోలని బాగా మగ్గనివ్వాలి

తరువాత ఇందులో చికెన్ ముక్కలు వేసి అంతా కలిపి ఐదు నిమిషాలు వేయించిన తరువాత, కొన్ని నీళ్లు పోసి, కలిపి, కడాయికి ఒక మూత పెట్టి, చికెన్ను ఇరవై నిమిషాలు ఉడికించాలి

ఆ తరువాత ఇందులో చిక్కటి కొబ్బరిపాలను పోసి, అంతా కలిపి, మసాలా బాగా దగ్గరపడేంత వరకూ ఉడికించాలి

కూర కాస్త దగ్గరపడిన తరువాత తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి

మసాలా కాస్త విడిగా ఉండాలంటే కూరలో కాస్త తడి ఉన్నప్పుడే పొయ్యి కట్టేయాలి

చికెన్ బాగా పొడిగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు అంతా వేయించాలి

ఆ తరువాత పొయ్యి కట్టేసి, స్పెషల్ చికెన్ ఫ్రైను ఉల్లిపాయ, కరివేపాకులతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

Dessert Recipes | So Yummy Cake Recipes | #shorts #shortsvideo #HowToCakeShorts

Chicken Mandi || Chicken Mandi Recipe with Smoky flavoured rice & without oven ||